ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదని, కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పురందేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పురందేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
Spread the love సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష- వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు సతీమణి వెల్లంపల్లి శ్రీవాణి సీఎం జగన్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే […]
Spread the love NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం : ది.07-05-2024(మంగళవారం) . ఏటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ […]
Spread the loveఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.తేదీ.10.12.2025. హోల్డింగ్ ఏరియాలను మరియు సి.సి.కెమెరాల ఏర్పాటు ను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ది.11.12.2025 నుండి […]