పికాబు చిల్డ్రన్స్ క్లినిక్ హెల్త్ యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు సుజనా చౌదరి,గద్దె రామ్మోహన్ రావు, డాక్టర్ పి.వి.రామారావు

0

 పికాబు చిల్డ్రన్స్ క్లినిక్ హెల్త్ యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు సుజనా చౌదరి,గద్దె రామ్మోహన్ రావు, డాక్టర్ పి.వి.రామారావు

 

పీడియాట్రిక్స్ విభాగంలో చిన్నారులకు భరోసానివ్వడానికి పటమట లోని పికాబు చిల్డ్రన్స్ క్లినిక్ ఒక వేదికను సృష్టించింది. పికాబు చిల్డ్రన్స్ క్లినిక్ మొబైల్ యాప్ ను ప్రారంభించింది. దీని ద్వారా వైద్యులతో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని సంప్రదించవచ్చని పీడియాట్రిక్స్ వైద్య నిపుణులు డాక్టర్ అడుసుమిల్లి గౌతమి తెలిపారు.

ఈ హెల్త్ యాప్ ను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి )తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, ఆంధ్ర హాస్పిటల్స్ పీడియాట్రిక్స్ డాక్టర్ పి వి రామారావు ప్రారంభించారు. 

ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సమాజంలో అందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని పిడియాట్రిక్స్ విభాగంలో చిన్నపిల్లలకు అత్యంత త్వరితగతిన వైద్య సదుపాయాల అందించడానికి యాప్ ను డిజైన్ చేసిన డాక్టర్ గౌతమి అడుసుమిల్లిని అభినందించారు. ఆసుపత్రులు రద్దీగా ఉంటున్న తరుణంలో యాప్ ద్వారా వైద్యుల అపాయింట్మెంట్ బుక్ బుక్ చేసుకోవడం ద్వారా సమయం ఆదా

అవుతుందన్నారు. చిన్నారులకు, తల్లిదండ్రులకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు.

హెడ్ అఫ్ ది మదర్ & చైల్డ్ డిపార్ట్మెంట్ ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ పివి రామారావు మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధతో చిన్నపిల్లల కోసం పీడియాట్రిక్స్ వైద్య నిపుణులు డాక్టర్ గౌతమి అడుసుమిల్లి ఈ హెల్త్ యాప్ ను రూపొందించారని చిన్నారులకు, సురక్షితమైన వేగవంతమైన సేవలు అందించాలని నిశ్చయించుకున్నారని తెలిపారు. మెడికల్ రికార్డ్స్ పొందుపరచడం వలన వేరే ప్రాంతాలకు వెళ్ళినా చికిత్స సులభతరం అవుతుందన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ వినూత్న ఆలోచనతో చిన్నారుల ఆరోగ్య సంరక్షణ నిర్వహణ కోసం ఈ యాప్ ను డిజైన్ చేయడం సంతోషకరమన్నారు. ఈ యాప్ ద్వారా సులభమైన సురక్షితమైన వైద్య సేవలను అందించడమే కాకుండా ఖచ్చితమైన మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

చిన్నారుల మెడికల్ హిస్టరీని పొందుపరుస్తూ అపాయింట్మెంట్ రిమైండర్ లను, పిల్ రిమైండర్ లను కలిగి ఉండటం ఈ యాప్ ప్రత్యేకత అని డాక్టర్ అడుసుమిల్లి గౌతమి తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version