పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి

0

 పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి

 

పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ             (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు 51వ డివిజన్ పరిధిలోని పితాని అప్పలస్వామి స్ట్రీట్, కొండ ప్రాంతం గణపతి రావు రోడ్, కృష్ణవేణి హోల్ సేల్ మార్కెట్ తదితర ప్రాంతాలలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు  సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. ముందుగా పితాని అప్పలస్వామి వీధి కొండ ప్రాంతంలో పర్యటించి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గణపతి రావు రోడ్డు , కృష్ణవేణి హోల్ సేల్ మార్కెట్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులు  మహంతిపురం వద్ద పొంగిన డ్రెయిన్లను పరిశీలించారు. డ్రెయిన్ల లో నీరు నిలవకుండా చేయాలని ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. కృష్ణవేణి మార్కెట్ ప్రధాన రహదారి పక్కన ఫుట్ పాత్ ను ఆక్రమించి నిలిపిన వాహనాలను తొలగించాలని మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరిగేలా చూసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశాలిచ్చారు. పర్యటనలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఈఈ వెంకటేశ్వర రెడ్డి, శానిటేషన్ సూపర్ వైజర్ శివరాం ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ దుర్గారావు, పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version