పాడేరు ఐటీడీఏ వ్యవహారం. .. అసెంబ్లీ లో ప్రస్తావిస్తా.. బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు

0

 భారతీయ జనతాపార్టీ 

*బిజెపి వారధి ఫిర్యాదు లు*

పాడేరు ఐటీడీఏ వ్యవహారం. .. అసెంబ్లీ లో ప్రస్తావిస్తా.. బిజెపి ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు

వైసీపీ ప్రభుత్వం  హయాంలో 2019 నుండి 2024 సంవత్సరం లో 

అరకు పార్లమెంట్ పరిధిలో యువజన శిక్షణ కేంద్రాలు లో భోజనాలు బిల్లు లు 72లక్షలు చెల్లించలేదని పి జయ,ఝాన్సీ, సరస్వతి లు ఫిర్యాదు చేశారు.వీరితో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడిన తరువాత ఈ అంశాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఫిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.

 పాడేరు ITDA పరిధిలో యువజన శిక్షణా కేంద్రాలలో డ్వాక్రా సంఘాల ద్వారా భోజనాలు పెట్టాలని ఆదేశించిన ITDA PO దాదాపు 4 సంవత్సరాల నుండి అనగా 2019 నుండి 2023 వరకు వారి బకాయిలు సుమారు 72 లక్షల 84 వేలు  చెల్లించలేదు.

 సీతంపేట, కే.ఆర్.పురం, రంపచోడవరం, శ్రీశైలం, పార్వతీపురం లో కూడా ITDA బకాయిలు చెల్లించలేదన్న విషయం కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందని విష్ణు కుమార్ రాజు అన్నారు 

 

. స్కిల్ డెవలప్మెంట్ APSSDC ఆర్డర్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చిన TP’s (ట్రైనింగ్ పార్టనర్స్) కు కుడా బకాయిలు చేల్లిచలేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు 

బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి,ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్, బిజెపి సీనియర్ నేత పైడి వేణు గోపాల్, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version