పశ్చిమ ప్రజల కలలను నిజం చేస్తా కూటమి గెలుపు చారిత్రక అవసరం సుజనా చౌదరి

0

 పశ్చిమ ప్రజల కలలను నిజం చేస్తా

కూటమి గెలుపు చారిత్రక అవసరం సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టి కొండ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తానని  బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సితార  వద్ద ఎన్ కన్వెన్షన్ హాల్ లో గురువారం డివిజన్ ఇన్ చార్జ్ లు, బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి డివిజన్ లోని ఏరియా కన్వీనర్లు బూత్ కన్వీనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలన్నారు. బీజేపీ-టీడీపీ-జనసేన నాయకులు కార్యకర్తలు ఐక్యంగా కలిసి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ  అరాచక పాలనకు చరమగీతం పాడాలని  నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని మరోసారి స్పష్టం చేశారు. అయిదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేశారో వైసీపీ  నాయకులు చెప్పాలన్నారు. కార్పొరేటర్ గా డివిజన్ అభివృద్ధిని విస్మరించిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడం సిగ్గుచేటు అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పశ్చిమాన్ని అభివృద్ధి చేస్తానని రోల్ మోడల్ గా నిలబెడతానని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమ లక్ష్యంగా ఆరోగ్య సురక్ష బీమా పథకాన్ని ప్రవేశపెడతానన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీయే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  . ఈ కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ అబ్దుల్ సత్తార్, టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ ముదిరాజ్ శివాజీ, టీడీపీ డివిజన్ సెక్రటరీ వల్లభనేని ప్రసన్నలక్ష్మి,  జనసేన డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష,  జనసేన నాయకులు తిరుపతి సురేష్, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version