జాతీయ భావజాలంతో సాగుతున్న సాయిరాం ప్రచారం సుజనా గెలుపు కోసం తపన

0

 జాతీయ భావజాలంతో సాగుతున్న సాయిరాం ప్రచారం

సుజనా గెలుపు కోసం తపన 

పశ్చిమంలో ఎండల్లో సాగుతూ

ఆయన ఒకప్పుడు కరడు గట్టిన వైసిపి నాయకుడు అయితే జాతీయ భావజాలం మెండుగా ఉన్న వ్యక్తి. అందుకే ప్రధాని మోడీ పై ఉన్న అభిమానంతో బీజేపీ లో చేరారు. సైకిల్ కు బీజేపీ జెండాలు కట్టుకుని పశ్చిమ నియోజకవర్గం లో పేర్ల సాయిరాం

కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ప్రజలను చైతన్య పరుస్తూ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

 తన సైకిల్ మీదే ప్రయాణం కొనసాగిస్తూ సుజనా చౌదరి గెలుపు కోసం కృషి చేస్తున్నారు .కరుడు కట్టిన వైకాపా పార్టీ నాయకునిగా ఉన్న పేర్ల సాయిరాం ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు వైకాపాలో కొనసాగారు జాతీయ భావజాలంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానంతో 

సుజనా చౌదరి గెలుపే లక్ష్యంగా ఆయన సమక్షంలో భాజపాలో చేరి

భారత్ మాతాకీ జై అంటూ ప్రయాణం ప్రారంభించారు.

 సుజనా చౌదరి గెలుపు, ఆవశ్యకతను వివరిస్తూ సాగుతున్న సాయిరాం ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది. నియోజకవర్గానికి ఆయన గెలిస్తే చేసే మేలు వివరిస్తూ చేపడుతున్న ప్రచారానికి ఓటర్లు నుంచి మంచి స్పందన వస్తోంది. సుజనా ని ఎందుకు గెలిపించాలీ..తద్వారా నియోజవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుందన్న అంశాలను సాయిరాం సోదాహరణంగా ప్రజలకు వివరిస్తున్నారు. 22 డివిజబ్లలో ఇటువంటి అంకిత భావం కలిగిన సైనికులు వున్నారు. వీరందరూ బీజేపీకి సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version