పశ్చిమలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

0

 పశ్చిమలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

 

ప్రైవేటుకు ధీటుగా పశ్చిమ లోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృషి చేస్తున్నారని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. సోమవారం 44 వ డివిజన్ లేబర్ కాలనీ లోని ఉప్పలపాటి రామచంద్ర రాజు ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించారు. ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచడం, విద్యావ్యవస్థను బలోపేతం చేయడం వంటి, అంశాలను చర్చించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు నియోజవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి తాగునీటి సౌకర్యం, తరగతి గదుల మరమ్మతులు, టాయిలెట్ల నిర్మాణం, వంటి మౌలిక వసతులను మెరుగుపరిచి విద్య వ్యవస్థను బలోపేతం చేసి పశ్చిమంలో ఆదర్శ పాఠశాలలను నెలకొల్పుతామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా కృషి చేస్తున్నారని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version