దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది భారత ఆర్ధిక వ్యవస్థను మార్చిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్

0

 *27.12.2024*

దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది

భారత ఆర్ధిక వ్యవస్థను మార్చిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్‌ సింగ్‌ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది అని కొనియాడారు. భారత ఆర్ధిక వ్యవస్థను మార్చిన గొప్ప మేధావి అని అన్నారు. దేశం ఒక గొప్పనేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు అని అన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు యార్లగడ్డ ప్రకటించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version