దేవదేవుని అనుగ్రహమే కూటమి ప్రభుత్వానికి బలం హిందువుల మనోభావాలను కాపాడుతున్నాం దేవస్థానం పవిత్రత ప్రభుత్వ బాధ్యత

0

 దేవదేవుని అనుగ్రహమే

కూటమి ప్రభుత్వానికి బలం

హిందువుల మనోభావాలను కాపాడుతున్నాం

దేవస్థానం పవిత్రత ప్రభుత్వ బాధ్యత

టీటీడీ నిత్యాన్నదానానికి 

కూరగాయల అందజేత

జండా ఊపి ప్రారంభించిన మధ్య నియోజకవర్గ బోండా ఉమామహేశ్వరరావు

విజయవాడ 

హిందువుల మనోభావాలను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అయోధ్య నగర్ లోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నివాసితులు బత్తుల రవికుమార్, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీసాయి 

చరణ్, చక్వాణయజ్ఞ వివాహ కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతీరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఎన్నో సంఘటనలు జరిగాయన్నారు. ప్రధానంగా కల్తీ నెయ్యితో లడ్లు తయారీ, అన్యమత ప్రచారం వంటి అనైతిక ఘటనలు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కూటమి ప్రభుత్వం దేవస్థానం పవిత్రతను కాపాడుతోందన్నారు. 

హిందువులు భక్తిప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమని ఈ మహత్కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

సమాజంలో ఎంతోమంది తమ తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ

ఉండదన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు 

ఇస్తాయన్నారు. కూరగాయలను విరాళంగా అందించిన దంపతులు బత్తుల రవికుమార్, శ్రీదేవి

మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టం మాకు

కలిగిందన్నారు.

కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని కీర్తిశేషులు మండవ కుటుంబరావు 2006లో ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంతో పాటు వేసి విదేశాలలోని స్వామివారి భక్తులు గత 18 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలను వితరణగా అందిస్తున్నారన్నారు. దేవదేవుడుని దర్శించుకునే ప్రతి భక్తునికి దాతలు వితరణ చేస్తున్న కూరగాయలతోనే అన్నదానం నిర్వహిస్తోందన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. మనం చేసే ప్రతి సత్కార్యము మనం నమ్మిన దైవశక్తి పిలుపు మేరకే నిర్వహించగలుగుతున్నామన్నారు. తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంతోషం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు.

భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు స్థానిక కార్పొరేటర్ చెన్నగిరి రామ మోహన్ రావు, వెలగా సురేష్, పూర్ణచంద్రరావు, మహర్షి, జ్యోతి, దూపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version