తుపాను నేపథ్యంలో మరోసారి కలెక్టర్లతో హోం మంత్రి టెలికాన్ఫరెన్స్

0

 తుపాను నేపథ్యంలో మరోసారి కలెక్టర్లతో హోం మంత్రి టెలికాన్ఫరెన్స్

విశాఖ బీచ్ లో రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించిన హోం మంత్రి అనిత

వీకెండ్, దసరా సెలవుల నేపథ్యంలో ట్రాఫిక్ , పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లపై ఆరా

విశాఖపట్నం తుపాను నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారానికి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆమె హోం, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వరుస టెలికాన్ఫరెన్స్ లతో రాబోయే తుపాను నుంచి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది, ఆస్తి నష్టం కలగకుండా ఉండేలా నిరంతరం కీలక శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. 

తుపాను ప్రభావమున్న జిల్లాల కలెక్టర్లకు సైతం తగు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు రాబోయే రెండు రోజులు తుపాను నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా విపత్తు నిర్వహణ శాఖ ద్వారా సందేశాలు, ఫోన్ లు చేసి అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలున్నాయన్న హెచ్చరికల ప్రకారం కలెక్టర్లు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని హోం మంత్రి మార్గనిర్దేశం చేశారు. 

నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. తుపాను ప్రభావం ఉన్న అన్ని జిల్లాలు రాబోయే రెండు మూడు రోజులు జాగరూకతతో వ్యవహరించాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేసే సందేశాలు, ఫోన్ ల ద్వారా విపత్తు శాఖ ఎప్పటికప్పుడు వెళ్లాలని ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లే అవకాశమున్న వాగులు, కాలువలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండేలా సూచనలివ్వాలన్నారు.  

విద్యుత్ స్తంభాలు, తీగలు,చెట్లు, హోర్డింగులు వంటి ప్రమాదాలకు ఆస్కారముండే ప్రాంతాల్లోనూ అన్ని శాఖలు సమన్వయంతో 24×7 అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

విశాఖ బీచ్ లో రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించిన హోం మంత్రి అనిత

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ బీచ్ లో ప్రజల రక్షణ చర్యలను ఆకస్మికంగా పరిశీలించారు. వీకెండ్ , దసరా సెలవుల వల్ల భారీ రద్దీ నేపథ్యంలో బీచ్ కు వచ్చిపోయే పర్యాటకులు, ప్రజల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై పోలీసులతో మాట్లాడి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీచ్ కి వచ్చే వారిలో అనుమానాస్పద కదలిలకలపై నిఘా పెట్టే సీసీ కెమెరాల ఏర్పాట్లపైనా ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలు రాకుండా చేపట్టిన చర్యల గురించి ఆరా తీశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version