టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గత కొంతకాలంగా తన లుక్ మార్చుకోవడంపై తీవ్రంగా దృష్టి పెట్టారు. వీలు దొరికితే జిమ్ లో కసరత్తులు, విరామం దొరికితే జర్మనీ వెళ్లి ప్రత్యేక వైద్య నిపుణుడి పర్యవేక్షణలో ట్రెక్కింగ్ లు, వగైరాలు చేస్తున్నారు. అగ్రదర్శకుడు రాజమౌళితో సినిమా చేస్తుండడంతో, ఆ సినిమా కోసమే మహేశ్ ఇంతగా శ్రమిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది.
గత కొన్ని సినిమాల్లో మహేశ్ బాబు ఎంతో స్లిమ్ గా కనిపిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఫొటో చూస్తే ఇంకా స్లిమ్ గా మారి సరికొత్త మహేశ్ బాబు అనేలా దర్శనమిస్తున్నారు. అంతేకాదు, ‘లేజర్ ఫోకస్’ (తదేక దీక్ష) అంటూ తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
మహేశ్ బాబు ఇటీవలే ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ తో చేయబోయే చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అడ్వెంచర్ జానర్ లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందించనున్నారు.
Spread the love నెల్లూరు: వైసీపీ కోసం పనిచేయాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. నెల్లూరు మెప్మా పీడీ రవీంద్రని శలవు పెట్టి వెళ్లాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి […]
Spread the love ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో రామారావు వచ్చే నెల 6 నుంచి నెలరోజుల పాటు ఇంద్రకీలాద్రి పై ఆషాఢ మాస సారె మహోత్సవం భక్తులు అమ్మవారి కి సారె సమర్పించుకునేందుకు అన్ని […]
Spread the loveవిజయవాడ నగరపాలక సంస్థ20-11-2025 7000 కు పైగా స్వయం సహాయక బృందాల మహిళలకు సఖి సురక్ష ద్వారా ఉచిత వైద్య మరియు క్యాన్సర్ పరీక్షలు 7000 కు పైగా స్వయం సహాయక […]