ప్రముఖ నటి పూనమ్ పాండే ఇటీవల గర్భాశయ కేన్సర్‌పై చేసిన ప్రాంక్ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో పాటు వివాదం కూడా చెలరేగింది. గర్భాశయ కేన్సర్‌తో ఆమె మృతి చెందినట్టు ఆమె టీం ప్రకటించింది. ఆ తర్వాతి రోజే పూనం పాండే స్వయంగా బయటకు వచ్చి తాను చనిపోలేదని, చాపకింద నీరులా విస్తరిస్తున్న గర్భాయ కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని చెప్పుకొచ్చారు. విషయం మంచిదే అయినా, అందుకు ఎంచుకున్న మార్గం మాత్రం సరికాదంటూ విమర్శలు రావడంతో ఆమె టీం క్షమాపణలు చెప్పింది. అది వేరే విషయం.
తాజాగా టీవీ నటి డాలీ సోహి ఇదే కేన్సర్ బారినపడి 47 వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. వ్యాధితో పోరాడుతూ ఈ ఉదయం నవీ ముంబైలో తుదిశ్వాస విడిచారు. జనక్, భాభీ వంటి టీవీ షోలతో చిరపరిచితమైన డాలీ మరణవార్త అందరినీ కలచివేసింది. ఆమె గర్భాశయ కేన్సర్ బారినపడినట్టు ఆరు నెలల క్రితమే నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు.
‘‘ఆమె ఇక లేరు. అపోలో ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. కేన్సర్ ఆమె ఊపిరితిత్తుల వరకు పాకింది. ఆరోగ్యం క్షీణించడంతో గతరాత్రే డాలీని ఆసుపత్రిలో చేర్చాం. అంతలోనే ఆమె ప్రాణాలు విడిచింది’’ అని ఆమె సోదరుడు మన్‌ప్రీత్ తెలిపారు. మరింత విషాదం ఏమిటంటే.. అంతకుముందు రోజు రాత్రే డాలీ సోదరి, నటి అమన్‌దీప్ సోహి పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందారు. డీవీ పాటిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు మన్‌ప్రీత్ తెలిపారు.
Spread the loveవిజయవాడ, తేదీ: 18.11.2025 • డ్రగ్స్ వద్దు బ్రో….. నినాదం ప్రతి విద్యార్థి నుండి వినపడాలి• డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం• డ్రగ్స్ రహిత దేశ, రాష్ట్ర సాధనే లక్యం […]
Spread the love విజయవాడ నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వరం బట్టీ విధానానికి స్వస్తి.. సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యా విధానం ప్రధాన ఉద్దేశం […]
Spread the love నేటి అవసరాలు తీరుస్తాం.రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుంది ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం – 30 ఏప్రిల్ 2024 మూడు […]