టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గత కొంతకాలంగా తన లుక్ మార్చుకోవడంపై తీవ్రంగా దృష్టి పెట్టారు. వీలు దొరికితే జిమ్ లో కసరత్తులు, విరామం దొరికితే జర్మనీ వెళ్లి ప్రత్యేక వైద్య నిపుణుడి పర్యవేక్షణలో ట్రెక్కింగ్ లు, వగైరాలు చేస్తున్నారు. అగ్రదర్శకుడు రాజమౌళితో సినిమా చేస్తుండడంతో, ఆ సినిమా కోసమే మహేశ్ ఇంతగా శ్రమిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది.
గత కొన్ని సినిమాల్లో మహేశ్ బాబు ఎంతో స్లిమ్ గా కనిపిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఫొటో చూస్తే ఇంకా స్లిమ్ గా మారి సరికొత్త మహేశ్ బాబు అనేలా దర్శనమిస్తున్నారు. అంతేకాదు, ‘లేజర్ ఫోకస్’ (తదేక దీక్ష) అంటూ తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
మహేశ్ బాబు ఇటీవలే ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ తో చేయబోయే చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అడ్వెంచర్ జానర్ లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందించనున్నారు.
Spread the love ఇంద్రకీలాద్రి కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయం లోని అన్ని విభాగముల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగినది. 26-06-2024: శ్రీ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ఆలయం లోని అన్ని విభాగముల […]
Spread the loveవిజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలకు ప్రత్యేక ఆహారం పెట్టు ప్రదేశాల ఏర్పాటు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో […]
Spread the loveఎన్టీఆర్ జిల్లా 20.11.2025 రైతుబజారుల నిర్వహణలో పారదర్శకతను పాటించాలి.. రైతుబజార్లలో అవకతవకల ఆనవాళ్లు కనిపిస్తే కఠిన చర్యలు.. రైతుబజార్లలో ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేందించాలి.. రైతుబజార్లలో ప్రత్యేక జూట్ క్లాత్ […]