టీడీపీ నాయకుల కార్యకర్తల సంక్షేమమే మంత్రి లోకేష్ లక్ష్యం

0

 టీడీపీ నాయకుల కార్యకర్తల సంక్షేమమే మంత్రి లోకేష్ లక్ష్యం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

* కూచిపూడి సుబ్బయ్య కుటుంబానికి భీమా చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం : 

టీడీపీ నాయకులు,కార్యకర్తల సంక్షేమమే లక్ష్యం గా మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.  మం డలంలోని చనుపల్లివారిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కూచిపూడి సుబ్బయ్య ఇటీవల రామవరప్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతునికి టీడీపీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో పార్టీ నుంచి మంజూరైన ప్రమాద భీమా చెక్కును మంగళవారం ఆయన సతీమణి విజయలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ పార్టీకి అంకితభావంతో పనిచేసే నిబద్ధత గల నాయకుడిని కోల్పోవటం బాధాకరమన్నారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ శ్రేణులకు అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకే మంత్రి లోకేష్  కార్యకర్తలు, నాయకులకు బీమా చేయించారని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా సుబ్బయ్య మాస్టారి సతీమణి విజయలక్ష్మి, కుమార్తె వన్యశ్రీలను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న యార్లగడ్డ కుటుంబ ఆర్థిక అవసరాలు ఆరా తీసి అర్హతలను బట్టి ఉద్యోగవకాశం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.  గన్నవరం నియోజకవర్గం లో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో టీడీపీ మండల కార్యదర్శి బోడపాటి రవి, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మేడేపల్లి రమ, సీనియర్ నాయకులు రామినీడు బసవపూర్ణయ్య, మేడేపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version