జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు: మంత్రి పార్థసారథి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు

0

 జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు: మంత్రి పార్థసారథి

సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొలుసు

పార్థసారథి

హర్షం వ్యక్తం చేసిన “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” (NARA)

అమరావతి

రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ మొదటి అంతస్తులో ఆధునీకరించబడిన తన చాంబరులో శాస్త్రోత్తంగా శుక్రవారం ఆయన ప్రవేశించారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్‌ కు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కు మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదములు తెలిపారు.  

పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రకటనలు జారీలో ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా తమకు నచ్చిన పేపర్లకు పెద్ద ఎత్తున జారీచేస్తూ, నచ్చని పేపర్లు వాటంతట అవే విత్ డ్రా అయ్యే పరిస్థితులు కల్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయంలో రూ.200/-లు పత్రిక కొనుగోలుకు ఇస్తూ అనధికారికంగా పలానా పత్రికనే కొనుగోలు చేయాలని నిర్థేశించినట్లు సమాచారం ఉందని, దానిపై విచారణ జరుగుతోందన్నారు. సంబంధిత జీవోను కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. 

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎం.డి. కె.రాజబాబు, సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్.స్వర్ణలత, సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version