జనసేన పార్టీలో చేరిన వైసీపీ కీలకనేతలు

0

 జనసేన పార్టీలో చేరిన వైసీపీ కీలకనేతలు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీసామినేని ఉదయభాను, కిలారి రోశయ్య చేరిక

 విజయనగరం జిల్లా నుంచి వైసీపీ నేతలు శ్రీ అవనపు విక్రమ్ దంపతులు  పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

వైసీపీలో కీలకంగా పని చేసిన పలువురు నేతలు గురువారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రకాశం జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి  బాలినేని శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కిలారి రోశయ్య విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యువజన విభాగం అవనపు విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లా డి.సి, ఎం.ఎస్. చైర్పర్సన్ అవనపు భావన పార్టీలో చేరారు, ఒంగోలుకు చెందిన వ్యాపారవేత్త కంది రవిశంకర్, నెల్లూరుకు చెందిన సినీ నిర్మాత చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు, వీరందరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పల్లె పల్లెకు జనసేన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ కార్యాలయం బయట కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల నుంచి భారీగా వచ్చిన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ కార్యాలయం వెలుపలకు వచ్చి వారికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ గజమాలతో పవన్ కళ్యాణ్ ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ , తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, టిడ్కో చైర్మన్, పార్టీ కాన్స్టిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ హెడ్ శ్రీ వేములపాటి అజయకుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు  బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నేతలు  చిల్లపల్లి శ్రీనివాస్, అక్కల గాంధీ, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version