ఘనంగా బొమ్మసాని జన్మదిన వేడుకలు
సీనియర్ నాయకులు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు జన్మదిన వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి అభిమానులు, నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు గొల్లపూడి లోని బొమ్మసాని కార్యాలయానికి హాజరై వేడుకలు నిర్వహించారు.పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గొల్లపూడి లోని వారి కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకలలో పాల్గొని బొమ్మసానికి శుభాకాంక్షలు తెలిపారు .