ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

0

 ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్థానిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో కూటమి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ మోదీ 74వ జన్మదినోత్సవం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షును కోరుకుంటున్నానని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగా, అగ్ర రాజ్యాంగా ఎదుగుతుందన్నారు. పదేళ్ల మోదీ పాలనలో 35 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రపంచ దేశాలలో భారత్ ను అగ్రగామిగా నిలబెట్టింది ప్రధాని మోదీ మాత్రమే నని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పాన్ని నెరవేర్చే దిశగా మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దారని ప్రధానిగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారని తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం పురోగతి చెందుతుందని ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేసే మోదీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే సుజనా ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ 2014 ముందు 14వ స్థానంలో ఉన్న భారత్ ను నాలుగో స్థానానికి తెచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. మూడవ టర్మ్ లో భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. భారత్ ను శక్తివంతమైన దేశంగా మార్చడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీని దేశ ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు. సూర్యారావుపేటలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ ఇంచార్జ్ శివమకుటం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సుజనా చౌదరి హాజరై ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు పోయి మంచి రోజులు వచ్చాయన్నారు. మోడీ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. మోడీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి స్టేట్ జోనల్ సెక్రెటరీ బిట్రా శివన్నారాయణ, మీడియా సెల్ కన్వీనర్ పాతూరి నాగభూషణం, శివమకుటం, షేక్ బాజీ, ఎమ్మెస్ బేగ్ ,పైలా సొమినాయుడు, బి ఎస్ కే పట్నాయక్, బోగవల్లి శ్రీధర్, పచ్చిపులుసుల ప్రసాద్, వడ్లాని మాధవరావు, నున్నా కృష్ణ, దాడి అప్పారావు, గుడివాడ నరేంద్ర రాఘవ, బాడి త శంకర్, కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version