ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లను స్మరించుకుంటూ భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో కొత్తపేట లో గురువారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు.

0

 ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ 

కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లను స్మరించుకుంటూ భారతీయ జనతా యువ మోర్చ ఆధ్వర్యంలో కొత్తపేట లో గురువారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు.

ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైగల్ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మరియు మాజీ సైనికులు కేబీఎన్ కళాశాల విద్యార్థులతో కలిసి నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి కొత్తపేట మీదుగా చిట్టి నగర్ వరకు ర్యాలీగా వచ్చారు. మిట్టా వంశి మాట్లాడుతూ 1999లో పాకిస్తాన్ సైనికులు ,ఉగ్రవాదులు లడఖ్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకొని వచ్చారన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాక్ చేసిన ప్రయత్నాన్ని ఆపరేషన్ విజయ్ తో కార్గిల్ నుంచి పాక్ సైనికులను తరిమికొట్టారన్నారు. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ అప్పటి అమరులైన 527మంది భారత జవాన్లను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నామని భారతదేశం కోసం పోరాడి వీరమరణం పొందిన జవాన్లను ప్రతి ఒక్కరూ స్మరణకు తెచ్చుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మువ్వల సుబ్బయ్య బి యస్ కె పట్నాయక్ చైతన్య శర్మ బోగవల్లి శ్రీధర్ అవ్వారు బుల్లబ్బాయి బిజెపి మహిళా నాయకులు బొడ్డు నాగలక్ష్మి యర్ర సునీత బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version