గ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

0

 గ్రూపు-2 మెయిన్స్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు.

23న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ – 1.

మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పేపర్-2

100 మీటర్ల పరిధిలో 144 నిషేధాజ్ఞలు.

వదంతులు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్.

ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న ఎపిపిఎస్సి గ్రూపు-2 మెయిన్ వ్రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్ర సచి వాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఎ. అనురాధతో కలిసి ఆయన అధికారులతో సమీక్షిం చారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తుతో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. 13 పాత జిల్లా కేంద్రాల్లోని 175 కేంద్రా ల్లో ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలను జిల్లాలకు పంపండం జరిగిందని వాటిని పూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు 92,250 మం ది అభ్యర్థులు హాజరు. కానున్నారని తెలిపారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబం ధించి సోషల్ మీడియాలో ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version