గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన ఎన్డీఏ కూటమి నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయమే లక్ష్యం

0

 తేదీ: 12-02-2025

ఉంగుటూరు మండలం పెద్దావుటపల్లి గ్రామం.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన ఎన్డీఏ కూటమి నాయకులు

ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయమే లక్ష్యం

గన్నవరం నియోజకవర్గ టిడిపి పరిశీలకులు వడ్రాణం హరిబాబునాయుడు

త్వరలో జరగనున్న ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు వడ్రాణం హరిబాబునాయుడు పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశాల మేరకు గత నాలుగు రోజులుగా గన్నవరం నియోజకవర్గ మండల కమిటీల నాయకులతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న ఎన్డీఏ కూటమి నాయకులు ఈరోజు ఉదయం పెద్ద అవుటపల్లి గ్రామంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారిని కలిసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ యొక్క ప్రచార కరపత్రాన్ని అందజేసి మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటికి వేయాలని, భారీ మెజారిటీతో ఆలపాటిని పెద్దల సభకు పంపాలని కోరారు.

ఈ సందర్భంగా వాడ్రాణం హరిబాబునాయుడు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ఓటు హక్కు నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి వ్యక్తిగతంగా కలిసి ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్క ఓటర్ ను కలుస్తామని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను భారీ మెజారిటీతో పెద్దల సభకు పంపించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో గెలుపే ప్రాధాన్యతగా పక్కా వ్యూహాలను అమలు చేయాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కోట వీరబాబు మాట్లాడుతూ విద్యావంతుడు, వినయశీలి, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి పెద్దల సభకు పంపాలని ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఒక్క అవకాశం పేరుతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసిందని ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటుక ఇటుక పేర్చుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాద్ (సూర్యం), క్లస్టర్ ఇంచార్జి తంగిరాల శ్రీనివాసరావు కొండేటి వెంకటేశ్వరావు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version