గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష

0

 

30.07.2024

గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష

అమరావతి: గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉన్నత స్థాయు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఛాంబర్‌లో ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్‌లతో విభిన్న అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, జిల్లాల వారీగా ఇసుక లభ్యత తదితర అంశాలపై వివరాలు  తెలుసుకున్నారు. ప్రతి జిల్లా లోనూ డిమాండ్ మేరకు ఇసుక లభించేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మించి ఎక్కడా వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలవుతున్న పరిస్థితులను వివరించారు. కార్యక్రమంలో ఆబ్కారీ , గనుల శాఖ ముఖ్య అధికారులు దేవకుమార్ , అనుసూయా దేవి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version