గణతంత్ర దినోత్సవం సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహించు

0

 *ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*తేదీ.25.01.2025*

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహించు

పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి ఎస్.

 రేపు ది.26.01.2025 తేదిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగబోవు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా స్టేడియం మరియు స్టేడియం పరిసర ప్రాంతాలలో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా బందోబస్తు నిర్వహించు పోలీస్ అధికారులకు మరియు సిబ్బందితో నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐ. పి. ఎస్. సమావేశం ఏర్పాటు చేసి సిబ్బంది నిర్వహించవలసిన విధులను, ప్రముఖులు వీఐపీలు మీడియా, సామాన్య ప్రజలు లోనికి ప్రవేశించు మార్గాల గురించి కూలంకశంగా వివరించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.  

 ఈ సందర్భంగా నగర్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ….. గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ , రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , ప్రముఖులు, వీఐపీలు, స్వాతంత్ర సమరయోధులు మరియు సుమారు ఐదు వేల మంది వరకు పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు హాజరవుతారు. బందోబస్తు నిర్వహించు సమయంలో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించాలని, వారు వెళ్లవలసిన మార్గాల గురించి తెలియజేస్తూ వారికి సహకరించాలని, ట్రాఫిక్ విభాగంలో వీధులు నిర్వహించేవారు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ట్రాఫిక్ నిలవకుండా ఉండేవిధంగా చూడాలని, ఎక్కడైనా ఏవైనా వాహనాలు బ్రేక్ డౌన్ అయినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి క్లియర్ చేయాలని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని తెలియజేశారు. సెక్టార్ అధికారులు వారి సెక్టార్ లో నియమించబడిన సిబ్బంది అందరూ సమర్ధవంతంగా విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేయాలనీ, సెక్టార్ పరిదిలో రద్దీని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అధికారులకు సమాచారం అందించాలని, బందొబస్త్ నిర్వహించు సమయంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే కమాండ్ కంట్రోల్ కు చెప్పాలని తెలియజేసారు. 

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్, డి.సి.పి.లు తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. ఉమామహేశ్వర రాజు ఐ.పి.ఎస్. ఎ.బీ.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్. కృష్ణమూర్తి నాయుడు ఎస్.వి.డి.ప్రసాద్ ఏ.డి.సి.పి. గుణ్ణం రామ కృష్ణ , ఇతర ఏ.డి.సి.పి.లు, ఏ.సి.సి.లు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ.లు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version