గంగానమ్మ తల్లి ఆలయంలో మంత్రి లోకేష్ దంపతుల పూజలు
తాడేపల్లి: తాడేపల్లిలోని గంగానమ్మతల్లి ఆలయ పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్, బ్రాహ్మణిలకు ఆలయ కమిటీ పెద్దలు ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతిఏటా ఆషాడమాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతి రెడ్డి సాంబిరెడ్డి నేతృత్వంలో ఇటీవల ఆలయాన్ని పునఃనిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన సీనియర్ నేత దొంతి రెడ్డి సాంబిరెడ్డి, కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తమవంతు సహాయ,సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబదయ్య,
జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్, టిడిపి తాడేపల్లి టౌన్ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, టిడిపి, జనసేన, బీజేపి నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు.