కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎంపికకు అన్వేషణ కమిటీ ఏర్పాటు

0

కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎంపికకు అన్వేషణ కమిటీ ఏర్పాటు 

 ఈనెల 18న పదవి విరమణ చేయనున్న ప్రస్తుత కమిషనర్

తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన అధికారుల తుది జాబితాను రూపొందించేందుకు అన్వేషణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ నేతృత్వం వహించనున్నారు. ఆర్థికశాఖ, సిబ్బంది వ్యవహారాలశాఖల కార్యదర్శులు ఇద్దరూ సభ్యులుగా ఉండనున్నారు. అత్యంత సీనియర్ గా ఉన్న అధికారులను ఎన్నికల కమిషనరుగా నియమించేవారు. సీఈసీ, ఈసీల నియామకాలకు సంబంధించిన నూతన చట్టాన్ని అనుసరించి అన్వేషణ కమిటీ ఐదుగురు కార్యదర్శి స్థాయి అధికారుల పేర్లతో తుది జాబితాను రూపొందిస్తుంది. దాని నుంచి ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సీఈసీ, ఈసీలను నియమి స్తుంది. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ (65) ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version