కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలి

0

 కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలి 

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ 

రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రెటరీ ఫతాఉల్లా 

కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు.

మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఫతాఉల్లా అన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి వన్ టౌన్ లోని హిందూ హై స్కూల్, ఎమ్ ఎస్ ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయుల ను గురువారం కలిసి ఓట్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎనిమిది నెలల కూటమిపాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలన్నారు. 

నిరుద్యోగ సమస్యను పరిష్కరించి , యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో అనుభవం కలిగిన వ్యక్తి ఆలపాటి రాజా అన్నారు. 

ఫతాఉల్లా మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన ఆలపాటికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం చేకూర్చాలని కోరారు.

తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూటమినేతలు మైలవరపు దుర్గారావు, వెంపలి గౌరీ శంకర్, బ్రహ్మాజీ, మెండి జ్యోతి, పెంటపల్లి బాజీ, దినేష్, సత్య సాయి, పైలా సురేష్, దాడి జగన్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version