కీలక రైల్వే పెండింగ్ పనులపై చర్చ జరగకపోవడం బాధాకరం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

0

 *30.01.2025

కీలక రైల్వే పెండింగ్ పనులపై చర్చ జరగకపోవడం బాధాకరం

వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా నెలకొన్న రైల్వే సమస్యలపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో కనీసం ప్రస్తావన రాకపోవడం బాధాకరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేవీనగర్ వైపు నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయని.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తుల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో రామకృష్ణాపురం నుంచి దేవీనగర్ వరకు ప్రధాన రహదారిని అనతికాలంలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కానీ రైల్వే అనుమతులు రాకపోవడంతో దేవీనగర్ రైల్వే వంతెన కింద కొంతమేర రహదారి పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. దీని కారణంగా ఆ ప్రాంత వాసులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావని మల్లాది విష్ణు అన్నారు. ఇటు శ్రీనగర్ కాలనీలోనూ అడ్డంగా కట్టిన గోడ కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బుధవారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్, రైల్వే డీఆర్ఎం, ఎంపీ, వీఎంసీ కమిషనర్ సహా కీలక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనప్పటికీ ఇటువంటి కీలక అంశాలపై చర్చ జరగకపోవడం బాధాకరమన్నారు. ఇదే విధంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు నేరుగా ఇబ్బందులకు గురవుతున్న రైల్వే అంశాలు అనేకమని మల్లాది విష్ణు అన్నారు. వీటన్నింటిపై పార్లమెంట్ సభ్యులు, రైల్వే అధికారులు దృష్టి సారించాలని.. లేనిపక్షంలో ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న రైల్వే అధికారుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version