కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం

0

 కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం

*8 నెలలుగా పాలనలో బిజీ అవ్వడంతో మీతో సమావేశం కాలేకపోయాను…కార్యకర్తలతో సమావేశం సంతోషిన్నిచ్చింది*

*ఎన్నిపనులున్నా వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తలను కలవడం బాధ్యతగా పెట్టుకుంటా*

*పార్టీ ఓడిందంటే నా పాలనలో తప్పుల వల్లకాదు…కార్యకర్తల అసంతృప్తి వల్ల*

*వైసీపీకి ఉపకారం చేస్తే పాముకు పాలుపోసినట్లే…ఈ విషయం నేతలు గుర్తు పెట్టుకోవాలి*

*కార్యకర్తలు ప్రాణం పెట్టి శ్రమించడంతో 30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరులో టీడీపీ విజయం…ఇక కంచుకోటగా మారుస్తా* 

*వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నవాళ్లు ఇప్పుడు ఏమయ్యారు?*

*జీడీ నెల్లూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

*క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన శ్రేణుల పేర్లను సమావేశంలో చదవి అభినందించిన సీఎం.* 

*పార్టీ కార్యక్రమాలు, నేతల పనితీరుపై కార్యకర్తల సమావేశంలో ఓపెన్ డిబేట్*

*జీడీ నెల్లూరు, మార్చి 1 :-* ‘కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పరిపాలనలో నిమగ్నమయ్యాను…అందుకే పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయాను. మళ్లీ కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. 30 ఏళ్ల తర్వాత జీడీ నెల్లూరు కోటపై టీడీపీ జెండా ఎగురవేశాం. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. మీకు నేను పూర్తిగా సహకరిస్తా…ఈ నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా మార్చాలి.  తంబళ్లపల్లి, పుంగనూరులో కొంచం గురితప్పాం తప్ప జిల్లా అంతటా టీడీపీ జెండా ఎగిరింది. వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నవాళ్లు ఇప్పుడు ఏమయ్యారు.? మొన్నటి ఎన్నికల్లో సరిగా చేసుకుని ఉంటే పులివెందులలోనూ మనమే గెలిచేవాళ్లం. పార్టీ స్థాపించిన నాటినుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ సారి మనం పగడ్బందీగా వ్యవహరించడంతో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలిచాం. మిమ్మల్ని, నన్ను ఎన్ని ఇబ్బందుల పెట్టినా ప్రాణాలు పోయినా పర్వాలదుగాగానీ, వారికి లొంగబోమని పోరాడటంతో 93 శాతం సీట్లు గెలిచాం.’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జీడీ నెల్లూరులో పేదల సేవలో కార్యక్రమం అనంతరం నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో శనివారం సమావేశమయ్యారు.  

*2004, 2019లో కార్యకర్తల అసంతృప్తి వల్లే ఓడిపోయాం*

‘దేశంలో ఎక్కడా ఇలాంటి విజయం రాలేదు. దీనికి కారణం 5 ఏళ్ల పాటు ప్రజలు, కార్యకర్తలు నరకం చూడటం. శనివారం వస్తే ఎక్కడ ప్రొక్లెయిన్ వస్తుందో, ఏ నాయకుడు అరెస్టు అవుతారో తెలియలేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని యంత్రాంగం టీడీపీకి ఉంది. దీనికి నేను చాలా గర్వపడుతున్నా. నేను రుణపడి ఉన్నానంటే అది పార్టీ కార్యకర్తలకే. అందుకే మీ రుణం తీర్చుకుంటానని చెప్తున్నా. ఇందుకు మీ సహకారం కూడా అవసరం. 2004, 2019లో పార్టీని నేనే ఓడించుకున్నాం. రాష్ట్రాన్ని బాగు చేయాలని, ప్రజల తలరాతలు మార్చాలని మిమ్మల్ని పట్టించుకోకుండా పని చేశా. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలబెట్టా. 2004లో ఓడిపోయాక అధికారంలోకి రావడానికి 10 ఏళ్లు పట్టింది. మళ్లీ 2014లో చాలా సమస్యలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం. కానీ సమైక్య ముసుగులో వైసీపీ విభజన కోరుకుంది. అయినా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మనల్ని గెలిపించారు. 2014-2019 మధ్య అవిశ్రాంతంగా పనిచేసి 13.5 గ్రోత్‌రేట్ సాధించాం. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలకు మంచి చేయకపోవడం వల్ల కాదు…కార్యకర్తల్లో అసంతృప్తి వల్లే. మీలో అనువణువు పసుపు రక్తం తప్ప మరొకటి ఉండదు. మీతో నేను మాట్లాడకుంటా ఉంటే మీరు కూడా నాపై అసంతృప్తిలో ఉంటారు. అందుకే కార్యకర్తల కోసం సమావేశం ఏర్పాటు చేశాను.’ అని అన్నారు. 

*నాకు, కార్యకర్తలకు మధ్య  దూరం ఉండదు*

‘మునుపు ఎన్నికలయ్యాక కేడర్ కోసం ఆలోచించలేకపోయాం. కానీ ఈ సారి కార్యకర్తలకు, నాకు గ్యాప్ ఉండదు. పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తలు, నేతలతో సమావేశమవుతా. పొలిటికల్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. పంచాయతీ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీ, అనుబంధ కమిటీలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలవడానికి కొత్తగా క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిలను తీసుకొచ్చాం. సోషల్ రీ ఇంజనీరింగ్ వల్ల ఘన విజయం సాధించాం. జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. టీడీపీకి ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది. పార్టీలో ఉండే సీనియారిటీని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేసి ఆస్తులను పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. పార్టీకి మరింత యువత బలం కావాలి. మొన్నటి ఎన్నికల్లో ఎక్కువ మంది యువతకు ప్రాధాన్యత ఇచ్చాం. 120 మంది ఓటర్ల కోసం కొత్తగా తీసుకొచ్చిన కుటుంబ సాధికార సారధిగా నేను కూడా ఉంటాను. పదవుల నియామకాల్లో పార్టీకి సేవ చేసిన వారికే ప్రాధాన్యం ఉంటుంది. ప్రజలు, కార్యకర్తల ఎంపిక మేరకే ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేశాను. ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఎమ్మెల్యే, ఎంపీ గురించి మీ నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్న మనం ప్రజల కోసం ఏం చేస్తున్నామో చెప్పడానికి కూడా సోషల్ మీడియా ఒక ఆయుధం…ప్రజలకు సమాచారం త్వరగా చేరవేయడంలో కీలకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి.’ అని సూచించారు.  

*ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తల సమస్యలు తీర్చాలి*

ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కేడర్‌కు అందుబాటులో ఉండాలి..సమస్యలు పరిష్కరించాలి. జనసేన, బీజేపీలతో సమన్వయంతో ముందుకెళ్లాలి. నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకారం చేసే పరిస్థితి ఉండకూడదు. ఈ విషయం నేతలకు నేరుగా, గట్టిగా చెప్తున్నా. వైసీపీకి ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే. శ్రేణులు కూడా ఒక్కొక్కరు ఒకరి ఇష్టం ప్రకారం కాకుండా నాయకత్వం కింద పనిచేయాలి. నా దృష్టిలో మాటలు చెప్పే వారు కాదు…ఓట్లు సంపాదించేవారే అసలైన విజేతలు. నన్ను పొడిగితే మీకు వచ్చేదేమీ ఉండుద. మీరు మంచిపనులు చేస్తే మన ప్రభుత్వం వస్తుంది…రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వన్ టైంగా చూసుకోవద్దు. మీరు రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండాలి. నాకు ఎన్నిపనులున్నా ఎక్కడికెళ్లినా కార్యకర్తలను కలవడం బాధ్యతగా పెట్టుకుంటా. మీకు నేను గౌరవం ఇవ్వడమే కాదు…అవసరమైతే కొరడా తీసుకుంటాను. మారకపోతే వేటు తప్పదు…అది కూడా త్వరలో చేసి చూపిస్తాను. మీతో 45 సంవత్సరాలు అనుబంధం ఉంది..అది శాశ్వతంగా ఉండాలి. మొన్నటి ఎన్నికల్లో నా మిత్రులను కూడా పక్కనబెట్టా. అవసరమైతే మీతో కలిసి టీ తాగుతా, భోజనం చేస్తానని చెప్పాగానీ పార్టీని త్యాగం చేయనని స్పష్టంగా చెప్పా.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version