కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి వైఎస్‌ జగన్‌

0

 24.06.2024

పులివెందుల, వైఎస్‌ఆర్‌ జిల్లా

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మూడో రోజు పులివెందుల పర్యటన వివరాలు

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి వైఎస్‌ జగన్‌

ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్‌ మనదే వైఎస్‌ జగన్‌

పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు. 

మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం, మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది, అందుకే ప్రజలకు మన పైనే విశ్వాసం ఉందని శ్రీ వైఎస్‌ జగన్‌ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. 

ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version