కళ్యాణమండపములో వీలేకర్ల సమావేశము జరిగినది. శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటి కార్యదర్శి డాll మరుపిళ్ళ హనుమంతరావు కోశాదికారి పిళ్ళా శ్రీనివాసరావు(లాయర్) మాట్లాడుతూ

0

విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ కళ్యాణమండపములో వీలేకర్ల సమావేశము జరిగినది. శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటి కార్యదర్శి డాll మరుపిళ్ళ హనుమంతరావు కోశాదికారి పిళ్ళా శ్రీనివాసరావు(లాయర్) మాట్లాడుతూ చిట్టినగర్ లో వేంచేసియున్న చిట్టి తిరుపతిగా కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవములు ది 11/06/2025 బుధవారం నుండి 15/06/2025 తేదీ ఆదివారం వరకు జరుగుతుంది అని, కార్యక్రమములు 11 తేదీ బుధవారం ఉదయం సహస్ర కలశ యాత్ర కృష్ణానది నుండి జలము తెచ్చుట అనంతరము ఉత్సవమూర్తులకు కలిసాభిషేకము మరియు స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట సాయంత్రము అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, గరుడ ఆరాధన, జరుగును.12 తేదీ గురువారము ఉదయం విష్వక్సేన పూజ పుణ్య హవాచన, ధ్వజరోహిణి మరియు సంతానార్థులకు గరుడ ప్రసాదము ఇవ్వబడును సాయంత్రం నిత్య హోమం, అష్టకరి హోమం, నవగ్రహ ఆరాధన, సహస్త్ర దీపాలంకరణ జరుగును. 13వ తేదీ శుక్రవారం ఉదయం నిత్య హోమం, బలిహరిణ, సామూహిక కుంకుమార్చన సాయంత్రము నిత్య హోమం, ఎదుర్కోల ఉత్సవము, మరియు శ్రీవారి కల్యాణ మహోత్సవం సాయంత్రం 7 గంటల నుండి జరుగును. 14వ తేదీ శనివారము ఉదయం నిత్య హోమం, మహాశాంతి హోమం మరియు శ్రీ పుష్ప యాగము జరుగును. సాయంత్రము గరుడ వాహనంపై స్వామివారి నగరోత్సవం జరుగును. 15 తేదీ ఆదివారము ఉదయం శ్రవణా నక్షత్రం సందర్భంగా ధ్రువ మూర్తి, ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం ,వసంతోత్సవం చక్రస్నానము పూర్ణాహుతి,సాయంత్రము 6:30 గంటలకు స్వామివారి పవళింపు సేవ జరుగును. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఉన్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని)గారిని,పచ్చిమనియోజక వర్గ శాసన సభ్యులు యలమంచలి సుజనా చౌదరి ని, నగరములో ఉన్న వివిధ పార్టీ నాయకులను, రాష్ట్రములో ఉన్న I.A.S., I.P.S. ఆఫీసర్లును దేవస్థానము వారు ఆహ్వానించడం జరిగినది.కావున ఈ ఉత్సవంలో కమిటీ సభ్యులు, నగరాల శాశ్వత సభ్యులు, ఈ ఉత్సవానికి సహకరించిన దాతలు, భక్తులు మరియు వివిధ శాఖల అధికారులు, యావన్మంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదల స్వీకరించగలరని కోరుచున్నాముఈ కార్యక్రములో కార్యదర్శి డాll మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ శ్రీనివాసరావు అడ్వకేట్,జాయిoట్ సెక్రటరీ పొట్నూరి దుర్గా ప్రసాద్(రాజా), కామందుల నరసింహారావు తమ్మిన సూర్యకుమారి మజ్జి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగినది. ఇట్లు ప్రధాన కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళ శ్రీనివాసరావు అడ్వకేట్, శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ, విజయవాడ-1.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version