ఓటు హ‌క్కు వినియోగించుకున్న కేశినేని శివ‌నాథ్ దంప‌తులు

0

 

27-02-2025

ఓటు హ‌క్కు వినియోగించుకున్న కేశినేని శివ‌నాథ్ దంప‌తులు

విజ‌య‌వాడ : ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని),త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. గురువారం ఉద‌యం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం లోని పటమట రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హై స్కూల్ లో కేశినేని శివ‌నాథ్, సతీమణి కేశినేని జానకి లక్ష్మి తో కలిసి సాధారణ ఓటర్స్ లాగా క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లును పరిశీలించిఎంపీ కేశినేని శివనాథ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఓట‌ర్లకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, ఎన్నిక‌లు నిష్పక్ష‌పాతంగా జ‌రిగేలా చూడాల‌ని ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నిక‌ల అధికారుల‌ను కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version