ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

0

 ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌‌లో వాట్సప్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సప్ సేవల కోసం నెంబర్‌ను విడుదల చేశారు మంత్రి లోకేష్. వాట్సప్ గవర్నెన్స్ కోసం నెంబర్ *9552300009* ను అనౌన్స్ చేశారాయన. దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్‌ ద్వారా పౌర సేవలు అందించనుంది ఏపీ సర్కార్. మొదటి విడతలో 161 సేవలను వాట్సప్ ద్వారా అందించనున్నారు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు.

 ఏయే సేవలు అందించనున్నారు

దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్ల సేవల్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తిపన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version