ఏపి ఫైర్ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నికైన సుబ్బయ్య

0

 ఏపి ఫైర్ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎన్నికైన సుబ్బయ్య

అమరావతి, ఆగస్టు4,:- ఫైర్ వర్క్స్ మర్చేంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఆదివారం నెల్లూరులో నిర్వహించిన ఫైర్ వర్క్స్ డీలర్ల కార్యవర్గ ఎన్నికల్లో ఎఫ్.యం.ఎ.ఎపి నూతన అధ్యక్షునిగా నెల్లూరుకు చెందిన ఫైర్ వర్క్స్ డీలర్ స్వర్ణ ట్రేడర్స్ అధినేత డి.వి.వి.సుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుబ్బయ్య మాట్లాడుతూ ఫైర్ వర్క్స్ మర్చేంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జరిగిన రాష్ట్ర కార్యవర్గ  రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నoదుకు ప్రతిఒక్క డీలర్ల కు,ఈసీ మెంబర్లకు అండగా ఉండి ప్రతి ఒక్క సమస్యను డీలర్ల సలహాలు సూచనలతో , డీలర్లను సమన్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతానని సుబ్బయ్య అన్నారు.  అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఫైర్ వర్క్స్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మన డీలర్లుతో పూర్వ కమిటీ సభ్యులతో సమావేశమై  ఒక నివేదిక రూపొందించి మన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ అధికారుల సహాయసహకారాలు కోరుతానని సుబ్బయ్య సభను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా సుబ్బయ్య, కార్యదర్శిగా నండిపాటి శ్రీధర్, ట్రెజరీ గా ఎ.వి.రమణయ్య ఎన్నికైనట్లు ఈసీ మెంబెర్స్ ప్రకటించగా పూర్వ అధ్యక్షులు కొత్తూరు ప్రదీప్ నుండి నూతనంగా ఎన్నికైన డి.వి.వి.సుబ్బయ్య భాద్యతలు స్వీకరించారు అనంతరం ఫైర్ వర్క్స్ మర్చేంట్స్ డీలర్లు సుబ్బయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఏసీ మెంబెర్స్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫైర్ వర్క్స్ డీలర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version