నటిగా సురేఖావాణికి మంచి పేరు ఉంది. అలాగే సోషల్ మీడియాలో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా జర్నలిస్ట్ ‘ప్రేమ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖ వాణి మాట్లాడుతూ, తన సోషల్ మీడియా పోస్టుల పట్ల వస్తున్న కామెంట్స్ గురించి స్పందించారు. “నేను మా అమ్మాయితో కలిసి బయటికి వెళ్లినా .. మా ఇద్దరికీ సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా కొంతమంది చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. మొగుడుపోయిన తరువాత విచ్చలవిడి అయిందని కామెంట్స్ పెడుతున్నారు.
భర్తలేని ఒక స్త్రీని చూసే దృష్టి కోణం మారుతుంది .. ఈ సమాజంలో ఇలాంటివాళ్లు ఉన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాధపడేదానిని కానీ, ఆ తరువాత కామెంట్స్ ను పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే ఎంతమంది నోళ్లని మూయిస్తాం. మా వాళ్లకు కూడా ఆ కామెంట్స్ చూడొద్దనే చెబుతుంటాను” అని అన్నారు.
” ఒకసారి వర్మగారితో కలిసి ఫొటో దిగితే, దానిపై ఒకడు ఏకంగా యూ ట్యూబ్ లో ఒక ఎపిసోడ్ చేశాడు. అలాంటివారిని చూసినప్పుడు, ఇంతమంది ఇంత ఖాళీగా ఉంటున్నారా? అని మనసులో అనుకుంటాను. నా వలన డబ్బులు సంపాదించుకుంటున్నారు .. ఈ విధంగానైనా ఓ నలుగురికి భోజనం పెడుతున్నాను అనే అనుకుంటాను” అని చెప్పారు.
Spread the love EVMS: ఇబ్రహీంపట్నం నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వద్ద భారీ భద్రత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు […]
Spread the love విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాయల్ హోటల్ సెంటర్ నందు రాయల్ బ్యాంకుట్ హల్ల్లో ఈ రోజు(ఎన్నికల నాడు) వైసిపికి మద్దతుగా ఐప్యాక్ టీం 15 లాప్టాప్ లతో మరియు 30 మంది […]
Spread the love తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, […]