తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు.
ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Spread the love విజయవాడ వాంబే కాలనీ 61వ. డివిజన్ A బ్లాక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ డివిజన్ ఇన్చార్జ్ నారాయణ. […]
Spread the love జన సైనికులుగా మారిన చిరు సైనికులు.. జన సేన కండువా కప్పుకున్న వైసిపి కి చెందిన చిరు అభిమానులు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు చిరంజీవి అభిమానులు జనసేన లో […]