ఉత్సాహంగా ఆక్వా డెవిల్స్ ఈత పోటీలు

0

 ఉత్సాహంగా ఆక్వా డెవిల్స్ ఈత పోటీలు

ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి ఫెస్టివల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా నదిలో ఆదివారం నిర్వహించిన ఈత పోటీలకు మంచి స్పందన లభించింది. 

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి స్విమ్మర్స్ ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

దుర్గా ఘాట్ నుంచి లోటస్ ఫుడ్ ప్లాజా వరకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన్ని క్రీడాకారులు స్విమ్ చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. సుమారు 600 మంది స్విమ్మర్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. 11 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్న వాళ్లు సైతం ఈ పోటీల్లో పాల్గొన్నారు.25 యేళ్ళ నుంచి కృష్ణా నది క్రాసింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. 

ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెలగపూడి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, సెక్రటరీ నరసరాజు, యుగంధర్, ఎన్డీయే కూటమి నేతలు ఆకుల శ్రీనివాస్ కుమార్, ఉమామహేశ్వరరెడ్డి, బేవర శ్రీను తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version