శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.
19 జూలై 2025
జగన్మాతకు బంగారు కంఠాభరణం సమర్పణ
ఇంద్రకీలాద్రి పై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారికి ఈరోజు సాయంత్రం బంగారు కంఠాభరణం సమర్పించారు.
హైదరాబాద్ కు చెందిన శ్రీ అడ్డగట్ల ప్రశాంత్, సంతోషిణి దంపతులు కుటుంబంతో విచ్చేసి 114 గ్రాముల బరువు గల బంగారు ఆభరణం సమర్పించారు.విశ్రాంత ఐపిఎస్అధికారి శ్రీ బి. వి రమణ కుమార్, ఐ. ఎ. ఎస్. అధికారి శ్రీమతి ఉదయలక్ష్మి దంపతులు,
దాత కుటుంబంనకు అమ్మవారి దర్శనం,వేద ఆశీర్వచనం అయిన అనంతరం ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ఎ ఈవో రమేష్ బాబు ప్రసాదం, అమ్మ వారి చిత్రం అందజేసారు.