శాకంభరీ నమోస్తుతే
ఇంద్రకీలాద్రి పై ప్రారంభమైన శాకంభరిఉత్సవాలు
జులై 10 తో ముగింపు
హరిత వర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి
ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఆలయ ఈవో శీనానాయక్
దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక పండగకు భక్తులరాక – మొదటి రోజైన మంగళవారం ఆలయ అలంకరణ,కదంభం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50టన్నుల కూరగాయల వినియోగం – గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ- కూరగాయల సేకరణ నిమిత్తం 10 రోజులు నుండి శ్రమిస్తున్న ఆలయ సిబ్బంది
ప్రధాన ఆలయం లో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహా మండపం లో ఉత్సవ మూర్తి, ఉపాలయాలల్లో దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనం రద్దు అని ప్రకటించిన ఈవో శీనా నాయక్