ఆలపాటి విజయానికి సమిష్టిగా కృషి చేయాలి

0

 ఆలపాటి విజయానికి సమిష్టిగా కృషి చేయాలి 

ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజవర్గ    ఎమ్మెల్సీ అభ్యర్థిగా  కూటమి తరపున బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ  కొనకళ్ళ బుల్లయ్య, టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ భేగ్ అన్నారు.

ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం కూటమినేతలతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ పట్టభద్రులైన ప్రతి ఒక్కరిని ఓటు హక్కు వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన విజయం కంటే మరింత విజయాన్ని అందించడం కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతికి  అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా పదివేల గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయని కూటమి నేతలు అందరూ అభివృద్ధి సంక్షేమాన్ని వివరించి  ఓటు వేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్మెస్ బేగ్ మాట్లాడుతూ ఓటర్లను కలిసి ఎనిమిది నెలల కూటమిపాలనలోని ప్రభుత్వ పనితీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించి పట్టభద్రులు  ఓట్లు వేసేలా సమిష్టిగా కృషి చేస్తామన్నారు.

సమావేశంలో  ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు వేణు మాధవ్,బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ డివిజన్ల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version