ఆలపాటి రాజాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

0

 ఆలపాటి రాజాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి 

ఎమ్మెల్యే సుజనా చౌదరి 

కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కూటమి అభ్యర్థి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) పిలుపునిచ్చారు.

ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ వన్ టౌన్ లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో  శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని మాట్లాడుతూ సేవా గుణం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి అని అన్నారు. ఆయనను శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయుల, ఉద్యోగ సంఘాలు, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించినట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలపాటికి మద్దతుగా నిలిచి అఖండ విజయం చేకూర్చాలని కోరారు.  ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పశ్చిమలోని మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా  నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ  తనను 

శాసన మండలికి పంపిస్తే ఉపాధ్యాయుల పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో కూటమి నేతలు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి ఎమ్ ఎస్ బెగ్, పైలా సోమి నాయుడు, కే బీ ఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణ రావు, సెక్రటరీ శ్రీనివాస్, పొట్టి శ్రీరాములు కళాశాల ప్రిన్సిపల్ శరవణ కుమార్, సెక్రటరీ అమర్ సుధీర్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్బారాయుడు అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version