ఆర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా అర్జీలను పరిష్కరించండి..• నిర్థేశించిన సమయంలో అర్జీలను పరిష్కరించాల్సిందే..జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ.

0

విజయవాడ తేది 21.07.2025

ఆర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా అర్జీలను పరిష్కరించండి..
నిర్థేశించిన సమయంలో అర్జీలను పరిష్కరించాల్సిందే..
జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ.

 ఆర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా అర్జీలకు పరిష్కరించూపాలని, నిర్థేశించిన సమయంలో అర్జీలను పరిష్కరించాల్సిందేనని ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని ఉపేక్షించబోనని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక  (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌)) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జీదారుల నుండి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీదారుల సంతృప్తి చేందాలనే లక్ష్యంతో అధికారులు సమస్యలను నిర్థేశించిన సమయంలో పరిష్కరించాలని ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించిన ఉపేక్షించే ప్రశక్తే లేదని కలెక్టర్‌ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో గ్రీవెన్స్‌ సెల్‌ను ఆశ్రయిస్తారన్నారు. వారి నమ్మకానికి బలం చేకూర్చే విధంగా నాణ్యతా ప్రమాణాలతో ఆర్జీలను పునరావృతం కాకుండా పరిష్కరించాలన్నారు. అర్జీలు ఎట్టిపరిస్థితులతో పెండిరగ్‌ ఉండరాదన్నారు. వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు పడే ఇబ్బందులు పరిష్కరించుకోవాలనే తపన అధికారులకు ఎలా ఉంటుందో ప్రజలకు కూడా ఆదే విధమైన భావన ఉంటుందనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకుని సేవ చేస్తున్నాననే మానవతాదృక్పథంతో సమస్యల పరిష్కారం పై దృష్టిపెట్టాలన్నారు. నమోదైన ఆర్జీలకు సంబంధించి కిందిస్థాయి అధికారుల నుండి తగిన సమాచారాన్ని సేకరించి అర్జిదారులను సంతృప్తి పరచడమే ధ్యేయంగా ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చాలన్నారు. ఆర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజు సమీక్షాన్నానని ఆర్జీల పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకున్నా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

169 అర్జీల స్వీకరణ:
రెవెన్యూ శాఖకు సంబంధించి 46, పోలీస్‌ శాఖకు 26, విద్య 23, ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్‌ 12, పంచాయతీరాజ్‌ 9, ఏపిసిపిడిసిఎల్‌ 8, పౌరసరఫరాలు 5, విభిన్న ప్రతిభావంతులు 5, డిఆర్‌డిఏ 5, ఎండోమెంట్స్‌ 5, రిజిస్టేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ 3, ఆర్‌ఐవో 3, ఆర్‌డబ్ల్యుఎస్‌ 3, హెల్త్‌ 2, సోషల్‌ వెల్ఫేర్‌ 2, సర్వే 2, వ్యవసాయం, పశుసంవర్థక, కో – ఆపరేటివ్‌,
అటవీ, జిఎస్‌డబ్ల్యుఎస్‌, హౌసింగ్‌, ఐసిడిఎస్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, నైపుణ్యాభివృద్ధి, నీటివనరులు కు సంబంధించిన ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 169 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, డిఆర్‌వో ఎం లక్ష్మీనరసింహం,  డీఆర్‌డీఏ పీడీ  ఏఎన్‌వి నాంచారరావు,  గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version