అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ సారె

0

21 జూలై 2025

అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ సారె సమర్పణ నిమిత్తం ఆలయం నకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళ కళ లాడింది.ఇంటి ఆడపడుచుకు ఏ విధంగా సారె సంభారములు పెడతారో అంతకంటే శ్రద్దగా, భక్తి తో భక్త బృందాలు సామాగ్రి తో తరలి వచ్చారు.

నెల మొత్తం మేళతాళాలు, మంగళ వాయిధ్యాలు నడుమ లక్షలకు పైగా బృందాలు విశేషరీతిలో విచ్చేశారు. మహా మండపం ఆరవ అంతస్తు వద్ద సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించి నారు. శ్రీ అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న చీరలను కార్యనిర్వహణాధికారి శీనానాయక్ సిబ్బందిచే భక్తులు ఇచ్చే చీరలకు కంప్యూటర్లో నమోదు చేయించి భద్రం చేయాలని ఎప్పటికప్పుడు సదరు నివేదికలకు కార్య నిర్వహణ అధికారి వారికి తెలియజేయాలని ఆదేశించి ఉన్నారు

ఆషాడ మాసం చివరికి చేరుకోవడంతో అనగా ఈనెల జూలై 24 తేదీ తో ఉత్సవములు ముగియును . కావున మిగతా రెండు మూడు రోజులు కూడా భక్తులు వినియోగించుకుని ఆషాడ మాస ఉత్సవాలకు ఘనముగా పరిసమాప్తి పలకవలసిందిగా ఆలయ కార్య నిర్వహణ అధికారి వారు ఒక ప్రకటనలో పేర్కొని ఉన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version