ఆధునిక విద్యకు ఆద్యుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

0

 22.02.2025

ఆధునిక విద్యకు ఆద్యుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్

వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు

దేశ స్వాతంత్ర్యం కోసం, జాతి అభ్యున్నతి కోసం మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడిగా, భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులు విప్లవాత్మకమని కొనియాడారు. మన దేశంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు, చిన్నారులలో ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు ఆ మహనీయుడు వేసిన అడుగులు మరువలేనివన్నారు. అలాగే మైనార్టీల అభ్యున్నతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ, ఆలోచనతో సమాజ శ్రేయస్సు కోసం అబుల్ కలాం ఆజాద్ పాటు పడ్డారని, ఆయన బాటలో యువత ముందుకు వెళ్లాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో నాయకులు యరగొర్ల శ్రీరాములు, అలంపూర్ విజయ్, ఎండి ఇస్మాయిల్, చల్లా సుధాకర్, తోపుల వరలక్ష్మి, నందెపు సురేష్, కాళ్ల ఆదినారాయణ, వెంకటేశ్వరమ్మ, విజయలక్ష్మి, అలీ, హుస్సేన్, మైనారిటీ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version