ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకం కు ఎంపికైన ఎమ్. కృష్ణమూర్తి నాయుడు ట్రాఫిక్

0

 ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.తేదీ.21.03.2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకం కు ఎంపికైన ఎమ్. కృష్ణమూర్తి నాయుడు ట్రాఫిక్

డి.సి.పి ని అభినందించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సుదీర్ఘ కాలంగా పారదర్శకత మరియు అంకిత భావంతో సమర్ధవంతంగా సేవలు అందించి తద్వారా ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా పథకం కు ఎంపికైన ఎమ్. కృష్ణమూర్తి నాయుడు ట్రాఫిక్ డి.సి.పి ని ది. 21.03.2025వ తేదీన విజయవాడ నగర పోలీస్ శాఖ తరపున పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ అభినందించడం జరిగింది.

 ఎమ్. కృష్ణమూర్తి నాయుడు ట్రాఫిక్ డి.సి.పి పోలీస్ శాఖలో సమర్ధవంతంగా పని చేసి, తద్వారా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 2025 సంవత్సరం ఉగాది సందర్భంగా మహోన్నత సేవా పథకం ప్రకటించడం జరిగింది.

ఎమ్. కృష్ణమూర్తి నాయుడు 1989 వ సంవత్సరం సబ్ఇన్స్పెక్టర్ గా సర్వీసు లోనికి వచ్చి ఏజెన్సీ ఏరియా లో చాలా కాలంసేవలు అందించినారు. అనతరం 1999 లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందినారు వీరు 2009వ సంవత్సరం డి.యస్.పి.గా, 2013 వ సంవత్సరం అడిషనల్ యస్.పి పదోన్నతి పొంది 2014లో యస్.పి పదోన్నతి పొందినారు అనంతరం విజయవాడ నగరంలో ఎ.డి.సి.పి క్రైమ్స్, ఇన్చార్జి అడ్మిన్ డిసిపి గా సేవలందించి ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందు ట్రాఫిక్ డి.సి.పి గా విధులు నిర్వహిస్తున్నారు., వీరికి గతంలో సేవా పథకం, ఉత్తమ సేవా పథకం కూడా రావడం జరిగింది, వీరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతులు మీదగా గతంలో ప్రతిభ ప్రశంస పత్రాలు అందుకోవడం జరిగింది వీరికి 30 నగదు రివార్డులు మరియు 75 ప్రతిభ ప్రశంసా పత్రాలు కూడా అందుకున్నారు.

ఈ నేపధ్యంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు  ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ని మర్యాధ పూర్వకంగా కలసి పూష్ప గుచ్చం అంధించడం జరిగినది అంతే కాకుండా కమిషనర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మున్ముందు ఇదే స్ఫూర్తితో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ప్రోత్సహించడం జరిగింది.*

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version