ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెడ్ కాప్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వేల్పుల రవికుమార్ రాజీనామా

0

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెడ్ కాప్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి వేల్పుల రవికుమార్ రాజీనామా

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం 

పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న పెనుగంచిప్రోలు లో నేడ్ కప్ కార్పొరేషన్ చైర్మన్ వేల్పుల రవికుమార్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెడ్ కాప్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి  వేల్పుల రవికుమార్ బుధవారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు తగిన గౌరవాన్ని కల్పించి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వడం పట్ల ఆయన జగన్మోహన్ రెడ్డి కి, ఈ పదవి రావడానికి కృషి చేసిన నాటి ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసన సభ్యులు  సామినేని ఉదయభాను కి, అనేక మంది పెద్దలకు అధికారులకు, రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా ప్రజలు మరల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదని అన్నారు.. నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ,బిజెపి ,జనసేన పార్టీల కూటమి ప్రజలకు అనేక వాగ్దానాలను ఇవ్వడం ద్వారా అధికారంలోకి వచ్చిందని చెప్పారు.గతంలో జగన్మోహన్ రెడ్డి అమలుపర్చిన పథకాలకు అనేక రెట్లు జోడించి ,తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని కూటమి ప్రజలకు వాగ్దానం చేసి గెలుపొందింది అ ని రవికుమార్ అన్నారు.ఏదైతే వాగ్దానాలు హామీ ఇచ్చి ప్రజల ఓట్లతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ వాగ్దానాలను అన్నింటిని అమలు చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరంతరం ప్రశ్నిస్తుందని, ఉద్యమిస్తుందని రవికుమార్ చెప్పారు… తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన మరు క్షణం నుండి రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో పనిచేసిన మంత్రుల పైన వారి ఇండ్ల.పైన ఎమ్మెల్యేల ఇండ్ల పైన, వైయస్సార్సీపి కార్యకర్తల ఇళ్ల పైన రాళ్లతో మారణాయుధాలతో, అనేక రకాల దాడులు నిర్వహిస్తున్నదని రవికుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు, దౌర్జన్యాలకు, స్థానం ఉండబోదని, అటువంటి చర్యలను ప్రజలు ఉపేక్షించరని రవికుమార్ అన్నారు. మంగళవారం నాడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని తాను తన సతీమణి వేల్పుల పద్మకుమారి తో కలిసి మాట్లాడామని, జగన్మోహన్ రెడ్డి అత్యంత ధైర్యంగా, గుండె నిబ్బరంగా ఉన్నారని ,రాష్ట్రంలో వారు త్వరలోనే పర్యటన చేయనున్నారని రవికుమార్ తెలిపారు. గాయపడిన కార్యకర్తలను, దాడికి గురైన నాయకులను స్వయంగా కలిసి పరామర్శిస్తానని జగన్ మోహన్ రెడ్డి తనకు చెప్పారని రవికుమార్ అన్నారు.కార్యకర్తల కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికి అయినా వైఎస్ఆర్సిపి నాయకులు సిద్ధంగా ఉన్నారని, కార్యకర్తలు కూడా ఎటువంటి ఇబ్బందులు దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నారని రవికుమార్ తెలిపారు.నూతన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలని ఆకాంక్షించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version