అవినీతిలో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన మాజీ సీఎం జగన్.

0

 అవినీతిలో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన మాజీ సీఎం జగన్.

రాష్ట్రాన్ని బాగు చేస్తానని అందర్నీ నట్టేట ముంచాడు.

జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసినందుకు అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రాబోయే పాతికేళ్లపాటు ఏపీ రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపాడు. 

సీబీఐ, ఈడీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్.బి.ఐ కూడా జగన్ అవినీతిని నిర్ధారించింది.

రూ.1750 కోట్ల జగన్ లంచం తీసుకోవడం ఆయన అవినీతికి పరాకాష్ట.

జగన్ తో కలసి నడిచేవారు వైసీపీలో కొనసాగితే దేశద్రోహంలో భాగస్వాములవుతారు.

దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ పురోగమిస్తుంది.

అమరావతి, 22.11.2024.

ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు అసెంబ్లీలో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు శుక్రవారం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయిలో ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్లో భారీ సౌరవిద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు ప్రయివేటు సంస్థల నుంచి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి రూ.1,750 కోట్లు లంచం తీసుకున్నారని సాక్షాత్తూ అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చిందన్నారు. అధిక ధరలకు సౌరవిద్యుత్ కొనేలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) తేల్చి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు.

ఒక్క అవకాశం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేస్తానని నమ్మించి, అందరినీ జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచాడని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించాడన్నారు. ఒకప్పుడు సీబీఐ, ఈడి కేసుల్లో చిన్నదొంగ అనుకుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగినందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి బాగోతం వల్ల అందరం తలదించుకునే పరిస్థితి నెలకొందన్నారు.

రాబోయే పాతికేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై ఎంతో ఆర్థిక భారాన్ని మోపాడని పేర్కొన్నారు. గతంలో ఆయనతో కలిసి పని చేసినందుకు తెలుగుజాతికి క్షమాపణలు తెలియజేస్తున్నానన్నారు. కాకుంటే ముందుగానే జాగ్రత్తపడి జగన్మోహన్ రెడ్డిని వదిలించుకున్నట్లు ఎమ్మెల్యే కృష్ణప్రసాదు స్పష్టం చేశారు.

దార్శనికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించాలని సీఎం చంద్రబాబునాయుడు తో కల్సి పనిచేస్తున్నామన్నారు. 

అవినీతిలో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించినందుకు జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న లూటీ విషయాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డితో పాటు అదే పార్టీలో కొనసాగితే ఆయన చేసే దేశద్రోహంలో వైసీపీ నాయకులు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version