అమ్మవారి అనుగ్రహంతోనే శాసన సభ్యునిగా ఎన్నికయ్యాను… భక్తులందరికీ సులభతర దర్శనం

0

 ఇంద్రకీలాద్రి 

అమ్మవారి అనుగ్రహంతోనే శాసన సభ్యునిగా ఎన్నికయ్యాను…

భక్తులందరికీ సులభతర దర్శనం…

దివ్యాంగులు, వృద్ధుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు

 లోటుపాట్లను సరి చేసుకుంటాం..

వచ్చే ఏడాది మరింత అద్భుతంగా నిర్వహిస్తాం

గత దశాబ్ద కాలంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏడాది జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈ ఏడాది దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల అభిప్రాయం ప్రకారం 95 శాతం మంది భక్తులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లు అద్భుతమని ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అతిపెద్ద ప్రశంస అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు 

యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం జగన్మాత దుర్గాదేవి అలంకారాన్ని దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడుతూ… కనకదుర్గమ్మ వారు నివసిస్తున్న ప్రాంతానికి శాసన సభ్యునిగా ఎన్నిక కావడం దుర్గామాత అనుగ్రహమేనన్నారు. ప్రతి ఒక్కరికి సులభతర దర్శనం అందించేందుకు శాఖల మధ్య సమన్వయం కూడా బాగా కలిసొచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, ఇంద్రకీలాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు, నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో అందిస్తున్న సహకారం వల్లే భక్తులు ఎంతో సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో దేవస్థానంపై జరిగే అన్ని ఉత్సవాలలో… మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది చేసిన ప్రయోగాలన్నీ విజయవంతం అయ్యాయన్నారు. ముఖ్యంగా వీఐపీ దర్శనాల కోసం ప్రత్యేక సమయం కేటాయింపు, దివ్యాంగులను దర్శనానికి తీసుకెళ్లేందుకు ప్రయోగాత్మకంగా వినియోగించిన యంత్రాలు… పనితీరు మెరుగుపరిచేందుకు వచ్చే ఏడాది ఉత్సవాల నాటికి చక్కదిద్దుతామన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు దేవాలయ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం బహుకరించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version