అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం అమ‌లు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం నిబద్ధ‌త‌కు నిద‌ర్శనం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

0

02-08-2025

అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం అమ‌లు ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం నిబద్ధ‌త‌కు నిద‌ర్శనం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
అన్న‌దాత సుఖీభ‌వ-పీఎం కిసాన్ ప‌థ‌కం ప్రారంభించిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వ‌సంత
జి.కొండూరు మండ‌లం క‌వులూరు లో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన రైతులు

జి.కొండ‌రు: గ‌త వైసిపి ప్ర‌భుత్వం రైతుల సంక్షేమాన్ని ప‌ట్టించుకోలేదు. నీటి పారుద‌ల రంగాన్ని నిర్వీర్యం చేసింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో రాష్ట్ర అభివృద్దితో పాటు పేద‌లు, రైతులు సంక్షేమానికి ఎన్డీయే కూట‌మి పెద్ద పీట వేస్తుంది. అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం పీఎం కిసాన్ ప‌థ‌కంతో క‌లిసి అమ‌లు చేయ‌టం ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌మ‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకాన్ని లాంఛనంగా శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా పార్టీ నాయ‌కులు ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ ను ఘ‌నంగా స‌త్క‌రించారు.

మైలవరం నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది అన్నదాతలకు రూ.20.19 కోట్ల రూపాయలు ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాదు పేర్కొన్నారు. రైతన్నల ఆనందోత్సాహల నడుమ పూర్తిగా పండుగ వాతావరణంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పీఎం మోడీ వారాణసిలో ‘పీఎం కిసాన్’ నిధులు విడుదల, దర్శిలో సీఎం చంద్రబాబు గారు ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమాలను ఆన్ లైన్లో వీక్షించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. రైతు కుటుంబాల‌కు కేంద్ర సాయంతో క‌లిపి ఏడాది రూ.20 వేల రూపాయ‌లు మూడు విడ‌త‌లుగా అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో అనుసంధానం చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుందన్నారు. మొద‌టి విడ‌త‌గా రైతుల‌కు ఏడు వేల రూపాయ‌లు వారి ఖాతాల్లో జ‌మ‌కానున్న‌ట్లు తెలిపారు.

ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం, పంట నష్టాల నివారణకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతోందన్నారు. ఈ పథకం రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అలాగే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం సూప‌ర్ సిక్స్ హామీల‌ను అమ‌లు చేయ‌టంలో అవిశ్రాంతంగా కృషి చేస్తుంద‌న్నారు.
సూపర్ సిక్స్ హామీలైన దీపం కింద మూడు ఉచిత సిలిండర్లు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపు, అన్నదాత సుఖీభవలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు.. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కూడా క‌ల్పించ‌నున్న‌ట్లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) , వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version