అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని కానూరు వశిష్ట జూనియర్ మహిళ

0

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని కానూరు వశిష్ట జూనియర్ మహిళ

కళాశాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కృష్ణాజిల్లా హోమన్ రైట్స్ జనరల్ సెక్రెటరీ చిల్లకూరి నాగలక్ష్మి ముందుగా విద్యార్థులకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులతో ఈ విధముగా గడపటం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఈ అవకాశం కల్పించినందుకు విద్యార్థులతో పాటు యాజమాన్యానికి నాగలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని,విద్య తోపాటు వైద్య రంగంలోనూ న్యాయ రంగంలోనూ రక్షక రంగంలోనూ క్రీడారంగంలోనూ మహిళలు వారి యొక్క ప్రతిభను కనబరుస్తూ తల్లిదండ్రులతో పాటు విద్యనందించిన గురువులకు కూడా మంచి గౌరవ మర్యాదలు అందించే విధంగా మీ భవిష్యత్తు ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version