సుజనా చౌదరి సమక్షంలో బీజేపీ లో చేరిన వైసీపీ నేత మేకల మాధవ్
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ బీసీ నాయకులు, అఖిలభారత యాదవ మహాసభ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ మేకల మాధవ యాదవ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు సమక్షంలో బీజేపీ లో చేరారు.
వైసీపీ నేత మేకల మాధవ్ కు తాడిగడప లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
సుజనా చౌదరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీ లో చేరానని మేకల మాధవ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కుమార్ గౌడ్ , నారదాసు వీర మణీంద్ర తదితరులు పాల్గొన్నారు ..